అంగన్‌వాడీల సమ్మెకు యుటిఎఫ్‌, సిపిఎం మద్దతు..

Dec 26,2023 20:30
ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం, యుటిఎఫ్‌ నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం, యుటిఎఫ్‌ నాయకులు
అంగన్‌వాడీల సమ్మెకు యుటిఎఫ్‌, సిపిఎం మద్దతు..
ప్రజాశక్తి-ఉదయగిరి : 15వ రోజు మంగళవారం అంగన్‌వాడీల నిరవధిక సమ్మెకు అంగన్‌వాడీలకు యుటిఎఫ్‌, సిపిఎం మద్దతు తెలిపారు. మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెకు వారు మద్దతు తెలిపి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అంగన్‌వాడీలపై దౌర్జన్యం భయభ్రాంతులకు గురి చేయడం జగన్‌ ప్రభుత్వానికి సిరికాదని సిఐటియుగా డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు మరిచారని జరిగే పార్లమెంటు సమావేశంలో అంగన్‌వాడీల సమస్యలు చర్చించి సమస్యను పరిష్కరించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు చంద్రశేఖర్‌, సుబ్బారెడ్డి, ఫణి, నాయబ్‌, అక్బర్‌, రామకృష్ణ, సిపిఎం మండల కార్యదర్శి ఫర్ధిన్‌, ప్రాజెక్ట్‌ అధ్యక్షరాలు ప్రమీల, నాయకులు రమాదేవి, కల్యాణి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️