అంగన్‌వాడీల సమ్మె జయప్రదానికి పిలుపు

 

అమలాపురంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న బేబీ రాణి

ప్రజాశక్తి-అమలాపురం

డిసెంబర్‌8న జరిగే అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెలర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అమలాపురం ఎంప్లాయిస్‌ హౌమ్‌ లో మంగళవారం జరిగిన అంగన్‌వాడీల విస్తత సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్‌కి నిధులు తగ్గించి అంగన్‌వాడీల సేవలు ప్రజలకు అందకుండా చేస్తుందని ఆమె అన్నారు. రాష్ట్రంలో వైఎస్‌.జగన్‌ ఎన్నికల ముందు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. అనేక రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు పెన్షన్‌ గ్రాడ్యుటి ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పట్టించుకోవడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తీవ్రమైన పని భారం రోజురోజుకు పని భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలకు పని భారం తగ్గించాలని మినీ వర్కర్లు మెయిన్‌ వర్కర్లుగా చేయాలని, కనీస వేతనం రూ.26వేల ఇవ్వాలన్నారు. రకరకాల యాప్‌లను తీసుకొచ్చి అంగన్‌వాడీలపై తీవ్రమైన పని భారాన్ని పెంచిందన్నారు. హెల్పర్స్‌కి ప్రమోషన్‌ 50 ఏళ్ల వయసుకు పెంచాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశం వెంకటలక్ష్మి అధ్యక్షతన నిర్వహించగా, ఏడు ఐసిడిఎస్‌ ప్రాజెక్టుకు సంబంధించిన జిల్లా కమిటీ సభ్యులు సెక్టార్‌ లీడర్లు పాల్గొన్నారు.

 

 

➡️