అంగన్‌వాడీ కార్యకర్తల భిక్షాటన

Dec 23,2023 21:43
ఫొటో : భిక్షాటన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

ఫొటో : భిక్షాటన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
అంగన్‌వాడీ కార్యకర్తల భిక్షాటన
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట శనివారం 12వ రోజు సమ్మెను నిర్వహించారు. వారికి మద్దతుగా సిఐటియు మండల అధ్యక్షులు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మట్టి హరినారాయణ ఉన్నారు. అందులో భాగంగా తహశీల్దార్‌ కార్యాలయంలో వివిధ పనులు నిమిత్తం అర్జీలు ఇవ్వడానికి వచ్చిన వారి దగ్గర భిక్షం అడిగి తమ నిరసన ప్రభుత్వానికి తెలియజేశారు. అదేవిధంగా ఎంపిడిఒ కార్యాలయం వద్ద కూడా భిక్షాటన చేశారు. అనంతరం మండల ప్రధాన కార్యదర్శి హరినారాయణ మాట్లాడుతూ అంగన్‌వాడీ వేతనాలు పెంచడానికి బడ్జెట్‌ లేదనే ప్రభుత్వం రిషికొండలో ముఖ్యమంత్రి గెస్ట్‌హౌస్‌ నిర్మాణం కోసం వందల కోట్లు ఎక్కడినుండి తెచ్చి ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️