అందరి సహకారంతో నగరాభివృద్ధి

Feb 2,2024 21:17

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : అందరి సహకారంతో నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పైడితల్లమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, కౌన్సిల్‌ సభ్యులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమన్వయం తో నగరాభివృద్ధికి తన వంతు కషి చేస్తానని అన్నారు. గతంలో ఇక్కడ సేవలందించిన అనుభవంతో మరింత మెరుగైన పాలనను అందిస్తానన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి, మేయర్‌ విజయలక్ష్మి సలహా సూచనలతో నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. సచివాలయాల పనితీరును మరింతగా మెరుగుపరిచి ప్రజలకు సులభతరమైన సేవలు అందే విధంగా కృషి చేస్తానన్నారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్‌ విజయలక్ష్మి లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

➡️