అంధవరపునకు అరుదైన గౌరవం

Mar 22,2024 21:08

 ప్రజాశక్తి – కురుపాం : కళింగ వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు, మాజీ జడ్పిటిసి, సామాజిక కార్యకర్త అయిన అంధవరపు కోటేశ్వర రావు అరుదైన గౌరవం దక్కింది. కరోనా సమయంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పేద ప్రజలకు మాస్కులు, శానిటైజర్లతో పాటు నిత్యం ఆహార పొట్లాలు అందజేసేవారు. అంతేకాకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలను తీరుస్తూ ఎల్లవేళల అందుబాటులో ఉంటూ ఆదుకుంటున్నందుకు ఆయన సేవలను విశాఖపట్నానికి చెందిన సెయింట్‌ పాల్స్‌ థియోలాజికల్‌ కాలేజ్‌ వారు గుర్తించి గౌరవ డాక్టరేట్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను చేసిన సేవలకు గుర్తించి డాక్టరేట్‌ను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. డాక్టరేట్‌ ను అందుకున్న సందర్భంగా కురుపాంకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

➡️