అంబరాన్నంటిన జాతర సంబరం

Feb 18,2024 20:48

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని జాకేరులో చిన్నమ్మలు జాతర ముగింపు సందర్భ ంగా నిర్వహించిన ఎడ్ల పరుగు పందేలు, సంగిడి రాళ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన ఎడ్ల పరుగు ప్రదర్శన యజమానులకు దాతలు సమ కూర్చిన విరాళాలతో మొదటి బహు మతి రూ.15వేలు, రెండో బహుమ తిగా రూ.12వేలు, మూడో బహుమతిగా రూ.8వేలు అందించారు. సంగిడి రాళ్ల తీత పోటీల్లో విజేతలకూ బహుమతులు ప్రదానం చేశారు. ఎడ్ల పరుగు పోటీలు ఉత్కంఠంగా సాగాయి. నువ్వానేనా అన్న చందంగా ఎడ్ల పరుగు పలువురిని ఆకట్టుకు న్నాయి. సంగడి రాళ్ల తీతలో క్రీడాకారులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్‌ బేబీ డాన్స్‌ ప్రదర్శన ఉర్రూతలూగించింది. ఆదివారం చివరి ఘట్టంతో జాతర ఘనంగా ముగిసినట్లు సర్పంచ్‌ బుద్ధ చిన్నమ్మలు, గ్రామ పెద్ద అప్పలనాయుడు, ససలాది వెంకటరావు, ఎంపిటిసి టి.వి.రమణ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు వెల్లడించారు.

➡️