అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

Jan 11,2024 20:51

ప్రజాశక్తి- డెంకాడ : లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఏటా సంక్రాంతి ముందు మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు విశ్వాసాలకు దగ్గరగా యువతను నడిపే దిశగా లెండి కళాశాలలోని కళా వేదిక పై సంస్థ ఫెమినా వింగ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగవల్లికలు, భోగి మంట, పిండి వంటలు, సంప్రదాయ వేషధారణలు, కోలాటాలు, హరిదాసు నామ సంకీర్తనలు, గాలిపటాలు, పడతుల వుత్సాహ బరిత నాట్యాలు అంబరాన్నంటాయి. కళాశాల చైర్మన్‌ పెద్దిరెడ్డి మధుసూదన రావు, సెక్రెటరీ అండ్‌ కరస్పాండెంట్‌ కోడూరు శివ రామకృష్ణ, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వివి రామారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హరిబాబు తమ్మినేని, ప్లేస్మెంట్‌ డీన్‌ జీ ప్రకాష్‌ బాబు పాల్గొని మాట్లాడారు. తమ సంస్థ ఎల్లప్పుడూ విలువలతో కూడిన విద్యాభ్యాసం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ సంవత్సరం కొత్తగా ప్రపంచ స్థాయి కి దీటుగా ప్రయోగశాలలు నిర్మించినట్లు తెలియజేశారు. విద్యతో బాటు ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తమ సంస్థ ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెనినా వింగ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జానకి, సీనియర్‌ ఆచార్యులు డాక్టర్‌ దుర్గా శైలజ, డాక్టర్‌ తిరుమల, విద్యార్థులు పాల్గొన్నారు.బొండపల్లి: మండలంలోని గొట్లాం గాయత్రీ టెక్నో స్కూలు, శ్రీగాయత్రీ జూనియర్‌ కళశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన హరిదాసు, గోదాదేవి, సంక్రాంతి లక్ష్మి, రైతు, జవాను, సోదమ్మ, శకుంతల వేశధారణలు ఆకట్టుకున్నాయి. పతాంగులు, ముగ్గుల పోటీలను యాజమాన్యం తరుపున డైరెక్టర్‌ జి.ఎరుకునాయుడు ప్రారంభించారు. అనంతరం భోగిమంటలను వేసి విజేతలకు డైరెక్టర్‌, కరస్పాండెంట్‌ అండ్‌ సెక్రటరీ జి. జగదీశ్వరి చేతులు మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి విశిష్టత, సాంప్రదాయం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గ్రామాల్లో సంక్రాంతి సందడిప్రజాశక్తి- రేగిడిహిందువుల ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి వారం రోజులు ముందుగానే ప్రజలు పండగకు గృహాలు అలంకరించుకుని సిద్ధపడతారు. దీంతో పల్లెలలో సందడి వాతావరణం నెలకొంటుంది. మండలంలోని 39 గ్రామ పంచాయతీలో హిందువులలో పెద్ద పండగ అయినా సంక్రాంతికి వలస కూలీలు, ఉద్యోగులు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ నెల 14, 15,16 సంక్రాంతి పండగలో భాగంగా విశాఖపట్నం, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వంటి పట్టణాలలో ఈ ప్రాంతానికి చెందిన వలస కూలీలు, ఉద్యోగులు తమ స్వగ్రామాలకు చేరుకొని సందడిగా కనిపిస్తున్నారు. కుటుంబ సమేతం, స్నేహితులతో ఆప్యాయత, అనురాగాలతో కనిపిస్తున్నారు. డూడు బసవన్నలతో డప్పు వాయిద్యాలు మారు మోగుతూ కుటుంబ తరతరాల పెద్దలతో పొగుడుతూ బసవన్నలు సందడి చేస్తున్నాయి. హరిదాసులు గ్రామాల్లోకి చేరుకొని సందడి చేస్తూ, హరి కీర్తనలతో అందరినీ అలరిస్తున్నారు. దీంతో గ్రామాల్లో భోగి నుంచి ముక్కోనుం వరకు ప్రజలు సరదా, సందడిలో కుటుంబా లతో గడుపుతారు. ఇతర ప్రాంతాలకు వలసలు నిమిత్తం వెళ్లిన వారంతా పండగకు స్వగ్రా మాలకు రావడంతో గ్రామాల్లో పండగ వాతావరణ నెలకొంది.సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలిరామభద్రపురం: సంక్రాంతి పండుగను ప్రజలంతా ఆనందంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సిఐ తిరుమలరావు తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సురేంద్ర నాయుడు ఆధ్వర్యాన విలేకరులతో మాట్లాడుతూ పండగ వేళ దూర ప్రాంతాలకు వెళ్లే వారు ముందుగా సమాచారం ఇస్తే గస్తీ ఏర్పాట్లు చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. జూదం, కోడి, గుర్రెం పందేలు నిషేదం అని ఎవరైనా అడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం, గొలుసు దుకాణాలు ఏర్పాటుపై నిఘా ఉంచామన్నారు. బహిరంగ మద్యపానం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, పరిమితికి మించిన వేగంతో ప్రయాణాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

➡️