అక్రమాల సర్వేయర్లపై చర్యలకు డిమాండ్‌

Jan 31,2024 00:36

ఎఒ చంద్రారెడ్డికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

పల్నాడు జిల్లా: రీ సర్వే సందర్భంగా చిన్న సన్నకారు రైతుల భూములను తక్కువ ఉన్న వారికి ఎక్కువుగా, ఎక్కువ ఉన్న రైతులకు తక్కు వుగా ఉన్న పత్రాలకు సంబంధం లేకుండా నమోదు చేస్తున్న సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని పిడిఎం నాయ కులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక ఆర్డీఓ కార్యా లయం ధర్నా చేపట్టి అనంతరం ఎఓ చంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. సర్వేలో అక్రమాలకు పాల్పడుతూ ఒకరి భూములు మరొకరికి ఎక్కిస్తున్న వినుకొండ సర్వేయర్‌ రవి కుమార్‌, నరసరావుపేట మండలం జొన్నలగడ్డ సర్వేయర్‌ రామాంజనేయులు పై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా పిడిఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నెం. 256-బి2,బి1, 256-బి1 లో , 2- 79 సెంట్లు గాను 9 సెంట్లు తగ్గిం చారని ప్రక్కన ఉన్న వాళ్లకు 8 సెంట్లు అదనంగా నమోదు చేశారన్నారు. ఇదే గ్రామంలో నిసంకి వెంకటేశ్వర్లుకు 2.40 సెంట్లకు 20 సెంట్లు తగ్గించారని యాదాల శ్రీనివాసరావు వివిధ రకాల సర్వే నెంబర్లలో 50 సెంట్లకు పైగా తక్కువ నమోదు చేశారన్నారని ఇదేమని ప్రశ్నించిన రైతులకు సర్వే యర్‌ రవికుమార్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని మండిపడ్డారు. కార్య క్రమంలో పిడిఎం రాష్ట్ర నాయకులు జి రామకష్ణ, జిల్లా అధ్య క్షులు షేక్‌ మస్తాన్‌ వలి, జిల్లా కార్యదర్శి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటా నాయక్‌, నల్లపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️