అదే సారు.. మారని తీరు..

Jan 10,2024 21:20

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని తోకలవలసలో బుధవారం నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రా మ్‌కు బూరాడ పిహెచ్‌సి వైద్యాధికారి చలమయ్య హాజరు కాకపోవడంతో గ్రామస్తులు విమర్శి స్తున్నారు. గతంలో జరిగిన కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదని వాపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక దిగువ స్థాయి సిబ్బంది ఎంఎల్‌ హెచ్‌ పి ధనలక్ష్మి, ఏఎన్‌ఎం సుబ్బలక్ష్మిలతో వైద్య సేవలు పొంది కార్యక్రమాన్ని ముగించారు. ఈ గ్రామంలో 1,307 మంది జనాభా ఉన్నారు. వీరు బూరాడ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు మేర ప్రయాణించాలి. నెలలో ప్రతి 2వ బుధవారం ఈ గ్రామానికి 104 ఆరోగ్య సేవలు అందవలసి ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా బూరాడ పిహెచ్‌సి వైద్యులు వైద్య సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ ఆయన జాడ కనిపించడం లేదు. డాక్టరు గైర్హాజరుతో పూరి ్తస్థాయి వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వైద్యుడు లేకుండా సిబ్బంది తనిఖీలు చేస్తే ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చాలా మంది గ్రామస్తులు వైద్యం శిబిరానికి రావడం లేదు. గ్రామస్తులు ఫిర్యాదు మేరకు ప్రజాశక్తి ఉదయం నుంచి మధ్యాహ్నం నాలుగు వరకు గ్రామంలో ఉండి వైద్య సేవలపై ఆరా తీసి పరిశీలించినా పూర్తిగా వైద్యులు రాకపోవడంతో జ్వరాలు, అతిసార సోకిన రోగులు రాజాం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి చేతి చమురు వదిలించుకోవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో బూరాడ వైద్యాధికారి చలమ య్య పనితీరుపై గ్రామస్తులు మండి పడుతు న్నారు. కాగా ఆయన బుధవారం ఆస్పత్రిలో కూడా కనిపించలేదని సిబ్బంది చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో లేక, ఆస్పత్రిలో లేక ఎక్కడికి వెళ్లారనే దానిపై స్పష్టత లేదు. పైగా ఆయన ఆస్పత్రికి వచ్చినట్లు సంతకం ఉందని సమా చారం. ఇప్పటికైనా వైద్యులు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించకుంటే, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పలువురు రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️