అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు : టిడిపి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మినీ మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్‌ పేర్కొన్నారు. శనివారం రామనపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 సంవత్సరాలపై నుంచి కమలాపురం నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్న టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహా రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాహా శక్తి పథకం, తల్లికి వందన ద్వారా రూ.15000, 18 సంవత్సరాలు నిండిన మహిళకు రూ.1500, సంవత్సరానికి 3 సిలిండర్లు, ప్రతి మహిళకు బస్సుల్లో వారి వారి జిల్లాలలో ఉచిత ప్రయాణం, రైతులకు అన్న దాత పథకం ద్వారా రూ.20,000, బీసీలకు రక్షణ చట్టం, నిరుద్యోగులులకు నిరుద్యోగ భతి,20 లక్షల ఉద్యోగాలు కల్పన, పేదలను పేద నుంచి ధనికులుగా మార్చడానికి కషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌ఛార్జి కొప్పోలు కష్ణా రెడ్డి, టిడిపి నాయకులు ముండ్ల నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం, మజ్ను, షేక్‌ బాషా భారు, బాలుడు, సిద్దయ్య, బాబు, కరీం, మస్తాన్‌ పాల్గొన్నారు.టిడిపి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తున్న మన్నూరు అక్బర్‌

➡️