అన్ని రంగాల్లో అభివృద్ధి : ఎంపి

Feb 24,2024 21:38

ప్రజాశక్తి- డెంకాడ  :  రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర రావు అన్నారు. మండలంలోని రఘుమండ, బొడ్డవలసలో నూతనంగా నిర్మించిన సచివాలయాలను, బిటి రోడ్లను ఇంటింటికి కుళాయిలను వారు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ఎంతో కృషి చేశారని తెలిపారు. వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు సేవ చేస్తున్నామని గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేసి సేవలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ సురేష్‌ బాబు, ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మి నాయుడు, డెంకాడ పిఎస్‌సిఎస్‌ చైర్మన్‌ రొంగలి కనక సింహాచలం, తహశీల్దార్‌ రామారావు, ఎంపిడిఒ లవరాజు, ఇఒపిఆర్‌డి శంకర్‌ జగన్నాథం, రఘుమండ, బొడ్డవలస సర్పంచులు గూడేల విష్ణు, ఎర్ర సన్యాసమ్మ, నాయకులు కోరాడ కోటినాయుడు, బమ్మిడి వెంకటరమణ, లంక లక్ష్మణరావు, తోరోతు త్రిమూర్తులు, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️