అభివృద్ధి చేశాం.. ఆదరించండి: ఎమ్‌పి

Mar 18,2024 21:14

ప్రజాశక్తి- చీపురుపల్లి : జిల్లాతో పాటు చీపురుపల్లి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసామని తమను ఆదరించాలని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలసి మండలంలోని మెట్ట పలి,్ల పత్తికాయవలస గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసామని, కోట్లాది రూపాయలను నియోజకవర్గానికి తీసుకు వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి బొత్స సత్యన్నారాయణ, తాను కలసి చేసామని గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో తనతో పాటు బొత్స సత్యన్నారా యణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల వరహాల నాయుడు, దన్నాన జనార్దనరావు, చందక శ్రీనివాసరావు, మీసాల ఈశ్వరరావు పాల్గొన్నారు.

➡️