అభివృద్ధి జరిగితేనే ఓటేయండి

Feb 26,2024 21:37

 ప్రజాశక్తి-చీపురుపల్లి  : నియోజక వర్గానికి మంచి, మేలు, అబివృద్ది జరిగిందంటేనే తనకు ఓటు వేయాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యన్నారాయణ ప్రజలను కోరారు. సోమవారం చీపురుపల్లి మూడు రోడ్లు కూడలిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2004లో తాను చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచినప్పటి నుండి అనేక విధాలుగా అభివృద్ధి చేశానన్నారు. చీపురుపల్లికి రెవిన్యూ డివిజన్‌తో పాటు సబ్‌ డివిజన్‌ కూడా తీసుకు వచ్చానని మంత్రి అన్నారు. తనపై అనుచిత వాఖ్యలు హానికరమైన వాఖ్యలు చేస్తే జరిగే పరిణామాలతో తనకు గాని, తమ పార్టీకి గాని ఎటువంటి సంబంధమూ లేదన్నారు. పార్టీలో కలసిన మీసాల వరహాలనాయుడుతో పాటు నియోజకవర్గంలో ఉన్న నాయకులంతా కలిసి పనిచేయాలని సూచించారు. అంతకు ముందు జెడ్‌పిటిసి మాజీ సభ్యులు మీసాల వరహాలనాయుడు, మాజీ సర్పంచ్‌ మీసాల సరోజిని. డాక్టర్‌ ఆర్‌.విజయసారధిరావుతో పాటు సుమారు 5 వందల కుటుంబాలు మంత్రి సమక్షంలో వైసిపిలో చేరారు.కార్య క్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, మండల పార్టీ అద్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష, జిల్లా యుజన ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, చీపురుపల్లి సర్పంచ్‌ మంగళగిరి సుధారాణితో పాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పార్టీ గెలుపుకోసం అందరితో కలసి పని చేస్తాను వైసిపి గెలుపుకోసం అందరితో కలసి పని చేస్తానని మీసాల వరహాలనాయుడు అన్నారు. పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అబివృద్ధికి టిడిపి నాయకత్వం అటంకంగా ఉండబట్టే తన అనుచర వర్గంతో పాటు వైసిపిలో చేరామని అన్నారు. అంతకు ముందు తన ఇంటి నుండి బారీ ర్యాలీగా సభా స్థలం వద్దకు చేరుకున్నారు.

➡️