అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు : కలెక్టర్‌

ప్రజాశక్తి-సంబేపల్లి (రాయచోటి) మండలంలోని పెద్దబిడికి సమీపంలోని చెరువులో ఉపాధి హామీ పథకం ద్వారా పర్కులేషన్‌ ట్యాంకు, ట్యాంక్‌ బండ్‌ ఏర్పాటుకు తగిన ప్రతిపా దనలు సమర్పించాలని డ్వామా పీడీ మద్దిలేటిని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశిం చారు. పెద్దబిడికి గ్రామ అభివద్ధికి సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో కలెక్టరు చర్చించారు. బుధవారం మండలంలోని పెద్దబిడికిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీసీతా రామలక్ష్మణ హనుమత్‌ సమేత నూతన విగ్రహావిష్కరణ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక, కర్మగారముల బాయిలర్లు, వైద్య సేవల శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్‌ హరిజవహర్‌లాల్‌, రాయచోటి, వైయస్సార్‌ జిల్లా కలెక్టర్లు అభిషిక్త్‌ కిషోర్‌, విజరురామరాజు, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన ్‌హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు ముఖ్య అతిథులకు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం శ్రీసీతారామ లక్ష్మణ హనుమత్‌ సమేత నూతన విగ్రహావిష్కరణ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను ముఖ్య అతిథులు ప్రారంబిచారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయ మండపంలో ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు వేదా శ్వీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, డ్వామా పీడీ మద్దిలేటి, అన్నమయ్య జిల్లా దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథ్‌, సంబేపల్లి తహశీల్దార్‌, ఎంపిడిఒ, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

➡️