అమరజీవికి నివాళులు

Dec 15,2023 20:30

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్థంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి కలెక్టర్‌ నాగలక్ష్మి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ అనిత, డిఆర్‌డిఎ పీడీ కల్యాణ చక్రవర్తి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ గౌరీశంకర రావు, జిల్లా బిసి సంక్షేమ అధికారి కె. సందీప్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ ఎఒ దేవ్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.భావితరాలకు అనుసరణీయం : మేయర్‌ పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు అనుసరణీయమని మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అమరులైన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, డిప్యూటీ మేయర్‌ ముచ్చు లయా యాదవ్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️