అరబిందో భూములు జెసి పరిశీలన

Feb 13,2024 21:18

ప్రజాశక్తి – భోగాపురం  : కోట  భోగాపురం రెవెన్యూ పరిధిలోని అరబిందో కంపెనీకి సంబంధించిన భూములను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె. కార్తీక్‌ మంగళవారం పరిశీలించారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో అరబిందో కంపెనీ కొనుగోలు చేసిన 75 ఎకరాలను గతంలో ఈడి సీజ్‌ చేసింది. ఆ తర్వాత ఈ భూములను నిషేధిత జాబితా నుంచి ఈడీ తొలగించింది. జాబితాలోలేని కొన్ని సర్వే నెంబర్లు ఇంకా నిషిద్ధ జాబితాలో ఉండడంతో తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారులు జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ ఈ భూములను పరిశీలించినట్లు తెలుస్తోంది. అరబిందో కంపెనీ ఈ భూముల్లో కంపెనీ కూడా పెడుతుందని గతంలో ప్రచారం కూడా జరిగింది. ఉప తహశీల్దారు శ్రీనివాసరావును ఈ భూ సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండల సర్వేయర్‌ ముదికేశ్వరరావు, సచివాలయం సర్వేయర్‌ సురేష్‌, విఆర్‌ఒ ఉషారాణి తదితరులు జెసి వెంట ఉన్నారు.

➡️