అర్హులందరికీ జగనన్న ఆరోగ్య శ్రీ కార్డులు

Dec 18,2023 20:38
మాట్లాడుతున్న ఎంపిపి, జెడ్‌పిటిసి

మాట్లాడుతున్న ఎంపిపి, జెడ్‌పిటిసి
అర్హులందరికీ జగనన్న ఆరోగ్య శ్రీ కార్డులు
ప్రజాశక్తి – వలేటివారిపాలెం : అర్హులందరికీ జగనన్న ఆరోగ్య శ్రీ కార్డులు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపిపి మైనిక, జెడ్‌పిటిసి ఇంటూరి భారతి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమ వారం జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ఎంపిపి కొనుగోటి మౌనిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లోని సమస్యలను సమావేశం దష్టికి తీసుకొచ్చారు కలవల్ల, నలదలపూరు గ్రామాల సమస్యల గురించి ఆయా గ్రామాల సర్పంచ్‌లు ప్రస్థావించారు. ఈ సందర్భంగా జెడ్‌పిటిపి ఇంటూరి భారతి, ఎంపిపి మౌనిక మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం గ్రామాల్లో పరిశుభ్రతపై ఆధారపడి ఉందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలన్నారు. ఎంపిడిఒ రఫీ మహ్మద్‌, తహశీల్దార్‌ సుందరమ్మ పాల్గొన్నారు. వారు అభివద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు పరిటాల వీరాస్వామి అనుమోలు వెంకటేశ్వర్లు ఇంటూరి హరిబాబు ఉన్నారు.

➡️