అర్హులందరికీ పింఛన్లు :’చింతల’

ప్రజాశక్తి-వాల్మీకిపురం అర్హులందరికీ పింఛన్లను అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో కొత్తగా మంజూరైన 104 పించన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల మాట్లా డుతూ అవ్వా తాత మదిలో ఆనందాన్ని నింపేలా సిఎం జగన్‌ పింఛన్‌ మొత్తాన్ని పెంచారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో పేదలు, వృద్ధులు, వితంతువుల కష్టాలు నేరుగా చూసి పింఛన్‌ను రూ.3వేలకు వరకు పెంచు తానని ఇచ్చిన హామీని నూతన సంవత్సరం కానుకగా అందించారని అన్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి నిర్మల, సర్పంచ్‌ గంగులమ్మ, నాయకులు నీళ్లభాస్కర్‌, కేశవరెడ్డి, అబ్దుల్‌ కలీమ్‌, శ్రీధర్‌రాయల్‌, మహబూబ్‌బాషా, నరసింహులు, నరసింహులు, వెంకట్రమణ, కిరణ్‌ కుమార్‌, రవి, షాహెద్‌, లక్ష్మినారాయణరెడ్డి, ఫారుఖ్‌, మస్తాన్‌, సైఫుల్లా, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. రైల్వేకోడూరు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పింఛన్ల పెంపు, నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. మండలంలో సుమారు 11 వేలకుపైగా పెన్షన్‌ దారులకు రూ.10కోట్లు పంపిణీ చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి రామిరెడ్డి ద్వజారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సుకుమార్‌రెడ్డి, ఎపి టూరిజం డైరెక్టర్లు వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, మందల నాగేంద్ర, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుబ్బ రామరాజు, ఉప సర్పంచ్‌ తోటశివసాయి, పట్టణ కన్వీనర్‌ రమేష్‌, కో-ఆప్షన్‌ సభ్యులు అన్వర్‌, ముస్లిం మైనార్టీ డైరెక్టర్‌ ముజీబ్‌, ఎంపిడిఒ జాషువా, సర్పంచ్‌లు దార్ల చంద్రశేఖర్‌, రామకష్ణ, వినోద్‌ పాల్గొన్నారు.పుల్లంపేటలో.. మండల కేంద్రంలోని ఎంపిడిఒ సభా భవనంలో ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, సీనియర్‌ నాయకులు కొల్లం గంగిరెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన పింఛన్లను లబ్దిదారులకు అందించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సయ్యద్‌ ముస్తాక్‌, మండల సచివాలయాల కన్వీనర్‌ నాగిరెడ్డి హరినాథరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ నవీన్‌ కుమార్‌, ఎపి టూరిజం డైరెక్టర్‌ సాయి కిషోర్‌రెడ్డి, ఎస్‌సి ఫైనాన్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, స్థానిక సర్పంచ్‌ ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి, వైస్‌ ఎంపిపి జయశంకర్‌, దల వాయిపల్లి మాజీ సర్పంచ్‌ మల్లికార్జునరెడ్డి, కుమార్‌రెడ్డి, ఎంపిడిఒ రఘురాం, పంచాయతీ కార్యదర్శి వేమయ్య పాల్గొన్నారు. బి.కొత్తకోట: మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన నూతన పింఛన్లు పంపిణీ కార్యక్ర మంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. పెంచిన పింఛన్‌ను నగర పంచాయతీ కమిషనర్‌ పి.ఆర్‌. మనోహర్‌, వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్‌అహ్మద్‌, ఎంపిడిఒ శంకర య్యలతో కలిసి లబ్ధి దారులకు పంపిణీ చేశారు.వైసిపి మండల అధ్యక్షుడు ప్రదీప్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిఆర్‌ చిన్నికష్ణ, ఎంలొలు రెడ్డిశేఖర్‌, భువ నేశ్వరచారి, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ డైరెక్టర్‌ కంచి కల్యాణ్‌కుమార్‌రెడ్డి, జడ్‌పిటిసి రామచంద్ర యాదవ్‌, ఎంపిటిసిలు రామసుబ్బారెడ్డి, సుబ్బయ్య నాయుడు, సర్పంచ్‌లు ఆదెప్పగౌడ్‌ పాల్గొన్నారు. గాలివీడు : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్ర మంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని లబ్దిదారులకు పెన్షన్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి జల్లా పద్మావతి, వైస్‌ ఎంపిపి-1 మిట్టపల్లి యదు భుషణ్‌రెడ్డి , వైస్‌ ఎంపిపి-2 గాలి శ్రీనివాసులు, సర్పంచ్‌లు మిట్టపల్లి అరుణమ్మ, ఉమాపతిరెడ్డి, కేశవరెడ్డి, మాజీ వైస్‌ ఎంపిపి రమేష్‌ రెడ్డి, మైనార్టీ నాయకుడు ఎస్‌కె. ఖాదర్‌ మోదీన్‌, ఎంపిడిఒ శేఖర్‌నాయక్‌, వెంకటాద్రి, పరశురాం, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొ న్నారు. చిన్నమండెం: మండల కేంద్రంలోని ఎఆర్‌ కల్యాణమండపంలో పింఛన్‌పెంపు, నూతనంగా మంజూరైన పింఛన్లను జడ్‌పి మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డితో కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి పంపిణీ చేశారు.అర్హులందరికీ పింఛన్‌ను వర్తింప చేస్తామన్నారు.ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల పెంచిన మాట నిలుపుకున్నారని అన్నారు. కార్య క్రమం లో సింగిల్‌ విండో అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, ఎంపిడిఒ దివ్య, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజలు పాల్గొన్నారు.

➡️