అశోక్‌బాబు పర్యటన

ప్రజాశక్తి-చుండూరు: వేమూరు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌ బాబు నియోజకవర్గంలో ఆయా మండలాల్లో వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూ పర్యటన వేగం పెంచారు. గత పది రోజులుగా అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామంలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడే నివాసం ఉంటూ నియోజకవర్గం ప్రజల కు అందుబాటులో ఉంటున్నారు. దీనిలో భాగం గా ఆయా గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మంగళవారం రాత్రి అద్దేపల్లి శారద కాలనీలో పల్లె నిద్ర చేపట్టగా, బుధవారం చుండూరు మండలంలో వివిధ రకాల కార్యక్రమాలు పాల్గొని అదే గ్రామంలో పల్లెనిద్రకు ఉపక్రమించారు.

➡️