ఆకట్టుకున్న ఎడ్ల పరుగు

Jan 28,2024 21:02

ప్రజాశక్తి- వేపాడ : మండలంలోని బల్లంకి గ్రామంలో శ్రీ మరిడిమాంబ జాతర సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఎడ్ల పరుగు పందేలు ఆకట్టుకున్నాయి. మొదటి విజేతకు రూ.12వేలు, రెండో విజేతకు రూ.10వేలు, మూడో విజేతకు రూ.8500 నగదు బహుమతిని గ్రామ సర్పంచ్‌ బల్లంకి వరలక్ష్మి, ఉప సర్పంచ్‌ పల్లె ధనుంజయ, పంచాయతీగా పాలకవర్గం, ఉత్సవ కమిటీ సభ్యులు చేతులు మీదుగా అందజేశారు. ఘనంగా పరదేశమ్మ, ముత్యాలమ్మ జాతరలుమండల కేంద్రంలో పరదేశమ్మ జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి యాత్రికలు క్యూ కట్టారు. సింహాద్రి అప్పన్న నామకరణంతో ఉన్న ఎద్దును ఊరేగించారు. ఈ సందర్భంగా పరుగు పోటీలు, సంగిడి రాళ్ల పోటీలు, జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, టైర్ల బండ్ల ఎడ్ల పోటీలు నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతులను గ్రామ సర్పంచ్‌ ఎం అర్జునమ్మ, ఎంపిటిసి గాడి గంగతల్లి, పంచాయతీ కార్యవర్గ సభ్యులు, వైసిపి నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు చేతుల మీదుగా అందజేశారు.

➡️