ఆడపిల్లల్ని కాపాడుకుందాం : ఎంఈఓ

Jan 4,2024 15:46 #East Godavari

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, సమాజం పైన, ప్రభుత్వం మీద ఉందని ఎంఈఓ-2 నాగేశ్వరరావు అన్నారు. కడియం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో హెచ్‌ఎం సత్యనారాయణ అధ్యక్షతన మండల స్థాయి బాలిక సంరక్షణ దినోత్సవ పోటీలు గురువారం జరిగాయి. మండలంలోని ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు వ్యాసరచన, డ్రాయింగ్‌ మరియు వక్తృత్వం పోటీల్లో పాల్గొన్నారు. వ్యాసరచనలో కడియం విద్యార్థినీ జి.విజయలక్ష్మి ప్రథమ స్థానం సాధించగా, వీరవరం విద్యార్థి కె.యశ్వంత్‌ ద్వితీయం, జేగురుపాడు విద్యార్థిని పి.సువర్ణ తృతీయ స్థానాలు సాధించారు. వక్తృత్వంలో వీరవరం విద్యార్థి సి.హెచ్‌.వి.డి. మణికంఠ ప్రథమ స్థానం, టి. హేమ కడియం ద్వితీయ స్థానం, వరలక్ష్మి జేగురుపాడు తృతీయ స్థానాలు సాధించారు. అలాగే డ్రాయింగ్‌ పోటీల్లో ఓదూరి గౌతమి నవ్య శ్రీజాతకడియం ప్రథమం, దిలీప్‌ సాయి వీరవరం ద్వితీయం , కార్తికేయ జేగురుపాడు తృతీయ స్థానాలు సాధించారని పోటీలు నిర్వాహకుడు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణ తెలియజేశారు. మండల విజేతలు జిల్లా స్థాయిలో పాల్గొనవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్‌ ఇమామ్‌, ప్రసన్నకుమారి, సువర్ణవేణి, కె.రాజు పాల్గొన్నారు.

➡️