ఆడుదాం ఆంధ్ర కిట్లు పంపిణీ

Dec 9,2023 20:24

ప్రజాశక్తి- విజయనగరంటౌన్‌  :  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కోసం క్రీడాకారులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిట్లను మాజీ ఎం.పి. బొత్స ఝాన్సీ లక్ష్మి శనివారం అందజేశారు. రాజీవ్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కిట్లను ఆమె అందజేశారు. కార్యక్రమంలో డిఎస్‌డిఒ అచ్యుత్‌ కుమార్‌, క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం, వారి శక్తి సామర్థ్యాలు గుర్తించి వారు క్రీడల్లో మరింతగా రాణించేలా తీర్చిదిద్దాలని అన్నారు.

➡️