ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : దద్దాల

ప్రజాశక్తి -కనిగిరి : బెంగళూరులో వైసిపి నాయకులతో ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వైసిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి నారాయణ యాదవ్‌కు బెంగులూరులో ఉన్న కనిగిరి ప్రాంత వైసిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్‌ మాట్లాడుతూ త్వరలో జరగున్న శాసనసభ ఎన్నికల్లో తనకు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. తన గెలిపిస్తే కనిగిరి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. వలసల నివారణకు కషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ ప్రసాద్‌ రెడ్డి, జడ్‌పిటిసిల సంఘ జిల్లా అధ్యక్షుడు గుంటక తిరుపతిరెడ్డి, కనిగిరి జడ్‌పిటిసి మడతల కస్తూరి రెడ్డి, సిఎస్‌పురం జడ్‌పిటిసి మేకల శ్రీనివాసులు, వైసిపి నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, సూరసాని మోహన్‌ రెడ్డి, దేవకి వెంకటేశ్వర్లు, తోమాటి మాధవరావు, ఓకే.రెడ్డి, దుగ్గిరెడ్డి ప్రతాపరెడ్డి, పాలుగుల్ల మల్లికార్జున రెడ్డి, ముత్యాల నారాయణరెడ్డి, దుగ్గిరెడ్డి జయరెడ్డి, కురుమాల నారాయణరెడ్డి, సిద్దు వెంకటరెడ్డి, ముడుమాల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️