ఆదర్శ ప్రాయుడు.. స్వామి వివేకానంద

Jan 12,2024 21:51

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమాజ హితాన్ని కాంక్షించే స్వామి వివేకానందుడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. శుక్రవారం జాతీయ యువజనోత్సవాల సందర్భంగా పాల్‌ నగర్‌ లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, జోనల్‌ ఇన్చార్జి డాక్టర్‌ వి ఎస్‌ ప్రసాద్‌, స్థానిక కార్పొరేటర్‌ దాసరి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

నేటి యువతకు స్వామి వివేకానంద ఆదర్శం

విజయనగరం : నేటి యువతకు స్వామి వివేకనందుడు ఆదర్శనీయమని మాతృభూమి సేవా సంఘం అధ్యక్షులు గెద్ద చిరంజీవి అన్నారు. మాతృభూమి సేవా సంఘం, నెహ్రూ యువ కేంద్రం, యువజన సర్వీసులు శాఖ ఆధ్వర్యంలో కనపాక యూత్‌ హాస్టల్‌ నందు జరిగిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం రక్తదానం చేపట్టారు. వివేకనందుడ్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని మంచి మార్గంలో నడుస్తూ సమాజ అభివద్ధికి పని చేయాలని కోరారు. కార్యక్రమంలో రామా నాయుడు, తాడేపల్లి నాగేశ్వరరావు, ఐ గోపాలరావు మాట్లాడారు. యువజన దినోత్సవండెంకాడ : ఎంవిజిఆర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యాన జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. కళాశాలలో, జిల్లా గ్రంథాలయ ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు. పాఠశాల విద్యార్థులకు, యువతకు వివేకానంద పుస్తకాలను పంపిణీ చేశారు. కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఎన్‌.షణ్ముఖరావు పాల్గొన్నారు.

వేపాడ : మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వంటాకు శ్రీను, రావాడ రామ సత్యం, రావాడ వెంకటరావు, గొర్లె అవతారం, రంగళి సత్తిబాబు, మహిళా కోలాట భజన గురువు, యువకులు పాల్గొన్నారు.మనో ధైర్యంతో ముందుకు సాగాలి వికలాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అన్నారు.

➡️