ఆదివాసీ నాయకుల గృహ నిర్బంధం

Jan 22,2024 21:31

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా పోరాటాలను అడ్డుకుంటే ప్రజా గ్రహానికి గురికాక తప్పదని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ హెచ్చరి ంచారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా విజయవాడకు తరలి వెళ్తున్న అంగ న్వాడీలకు సంఘీభావంగా పోరాడుతున్న ఆదివాసీ గిరిజన సంఘం నాయకులైన కోలక అవినాష్‌, మండంగి రమణను ఎల్విన్‌పేట పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా అవినాష్‌ మాట్లాడుతూ విజయవాడకు తరలి వెళ్తున్న ఆదివాసీ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని గృహనిర్బంధాలు చేయడం ప్రభుత్వ దుర్మార్గపు చర్యకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించ కుండా బెదిరింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేట న్నారు. అంగన్వాడీల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించు కుంటే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల పోరాటాలకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.పోలీసుల అదుపులో సిఐటియు జిల్లా అధ్యక్షులుపాలకొండ : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెలో భాగంగా చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో సోమవారం ఉదయం విజయవాడ వెళ్లడానికి స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద ఉన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావును పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

➡️