ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మానవత్వం

ప్రజాశక్తి – చింతలపూడి

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే నిజమైన మానవత్వమని మాజీ సొసైటీ ఛైర్మన్‌ ఆత్కూరి సుబ్బారావు అన్నారు. పట్టణంలో గత 3 రోజుల క్రితం సుప్రియన్‌ పేటలో చెట్టు విరిగి చనిపోయిన హెచ్చు శ్రీను కుటుంబాన్ని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పరామర్శించి, ఆర్థిక సహాయంగా మానవత స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.10 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో మానవత సభ్యులు గౌరవ డైరెక్టర్‌ ఎ.సత్యనారయణ, చింతలపూడి సొసైటీ మాజీ ఛైర్మన్‌ ఎ.సుబ్బారావు, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చింతలపూడి శాఖ ఛైర్మన్‌ ఎ.అప్పారావు, కో ఛైర్మన్‌ ఎం.శామ్యూల్‌, అధ్యక్షులు పి.సోమశేఖర్‌, కన్వీనర్‌ కె.నాగ చిన్నారావు, కమిటీ సభ్యులు ఎస్‌.కిరణ్‌ బాబు, కె.రాంబాబు, పి.కిషోర్‌(మీడియా), చింతలపూడి ఎఎంసి మాజీ డైరక్టర్‌ కె.ఏలియ, స్థానికులు పాల్గొన్నారు.

➡️