ఆర్‌ఎఆర్‌ఎస్‌కు జాతీయ అవార్డు

జాతీయ స్థాయి అవార్డు అందుకుంటున్న ఎడియు డాక్టర్‌ జగన్నాధరావు, శ్రీదేవి

ప్రజాశక్తి-అనకాపల్లి :

భారత వ్యవసాయ పరిశోధన మండలి, జాతీయ పంట కోత అనంతర సాంకేతిక పథకం లూథియానా జాతీయ స్థాయిలో ఈనెల 13 నుంచి 15 వరకు నిర్వహించిన 39వ వార్షిక జాతీయ సదస్సు సందర్భంగా ప్రకటించిన అవార్డుల్లో అనకాపల్లి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మూడో స్థానం దక్కించుకుంది. ఇప్పటికే ఆర్‌ఏఆర్‌ఎస్‌ బెల్లంపై చేసిన విశేష పరిశోధనలో అనేక మైలురాళ్లు దాటింది. మూడు పేటెంట్లు దక్కించుకుంది. మరో రెండు పేటెంట్లకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3.73 కోట్లతో నిర్మించిన ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ద్వారా చెరకు చిరుధాన్యాల, పనస శుద్ధి చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారీకి శిక్షణ ఇస్తున్నారు. కాగా ఈ అవార్డును ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిశోధన సహ సంచాలకులు డాక్టర్‌ బివికే జగన్నాథరావు, వ్యవసాయ ఇంజనీర్‌ డాక్టర్‌ శ్రీదేవి అందుకున్నారు. ఈ సందర్భంగా వీరిని భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలతో పాటు, ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు అభినందించారు.

➡️