ఆర్‌పి పట్నాయిక్‌కు ఘంటసాల స్మారక పురస్కారం

Dec 1,2023 21:31

ప్రజాశక్తి-విజయనగరంకోట  :  ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయిక్‌కు ఘంటసాల స్మారక పురస్కారాన్ని శుక్రవారం ఘంటసాల స్మారక కళాపీఠం అందజేసింది. శతాబ్ది గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 101 జయంతి సందర్భంగా ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.భీష్మారావు ఆధ్వర్యంలో స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 12 గంటలు నిర్విరామ ఘంటసాల స్వరాభిషేకం కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహ భరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్లే బ్యాక్‌ సింగర్‌ సౌజన్య , సాయి- పవన్‌ తదితర వర్ధమాన గాయకులు పాల్గొని అలనాటి ఘంటసాల ఆలపించిన మధుర గేయాలు ఆలపించారు. అనంతరం పురస్కార గ్రహీత ఆర్‌పి పట్నాయిక్‌కు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వర్‌ కౌశిక్‌, ఇతర ప్రముఖులు ఘంటసాల స్మారక పురస్కారాన్ని అందజేశారు. అనంతరం ఆర్‌పి పట్నాయక్‌ మాట్లాడుతూ తాను ఎవరి దగ్గరా సంగీతం శిష్యరికం చేయకపోయినా ఈ రోజున సంగీత దర్శకుడు అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సమాజంలో తన వంతు మార్పు కోసం ట్రిగ్గర్‌ అనే షార్టు ఫిల్మ్‌ చేశానని, ఇది సమాజం లో మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఇది ఆస్కార్‌ అవార్డ్‌కు క్వాలిఫై అయ్యిందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథి విష్ణు మూర్తి, బుచ్చిబాబు, మేకా ఆనంతలక్ష్మి, అబ్బులు, డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఉమా మహేశ్వరరావు, కోశాధికారి వై.వివి.సత్యనారాయణ, కాపుగంటి ప్రకాష్‌, గోపాల్‌ రావు, బుచ్చి బాబు, సర్వేశ్వరరావు, తదితరులు పోల్గొన్నారు.

➡️