ఆలయాల అభివృద్ధికి కృషి

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో ప్రజలకు, యాత్రికులకు అందుబాటులో ఉంటూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా దేవాదాయ శాఖ అధికారి సి. విశ్వనాథ్‌ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో దేవాలయాల అభివద్ధిని ఎలా చేయాలో, నూతన ఆలయాలను ఎన్ని నిర్మిస్తున్నారో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.అన్నమయ్య జిల్లాలో ఆలయాలు వివరాలు తెలపండి? అన్నమయ్య జిల్లాలో మొత్తం 1655 ఆలయాలున్నాయి. 30 సత్రాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆరుగురు ఆలయ ఇఒలు ఉన్నారు. ఆలయ ఇందులో గ్రేడ్‌ – 1 ఒకరు, గ్రేడ్‌-2 ముగ్గురు, గ్రేడ్‌-3 ఇద్దరు ఇఒలున్నారు. శ్రీ రెడ్డమ్మ దేవస్థానం చెర్లోపల్లి గ్రామం, గుర్రంకొండ మండలం, శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం రాయచోటి టౌన్‌, శ్రీ గంగమ్మ దేవత దేవస్థానం అనంతపురం గ్రామం లక్కిరెడ్డిపల్లి మండలం, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం మదనపల్లె టౌన్‌, సుండుపల్లె, రాజంపేట, వాయల్పాడు, బి .కొత్తకోట గ్రూప్‌ ఆలయాలున్నాయి. దేవాదాయ శాఖ భూముల వివరాలు తెలపండి? జిల్లా వ్యాప్తంగా 9761.3 సెంట్లు ఉన్నాయి. బి. కొత్తకొట 380.95, చిన్నమండెం445.16, చిట్వేల్‌ 187.17, గాలివీడు 686.63, గురంకొండ 350.6, కలకడ 182.64, కలికిరి 315.93, కె.వి.పల్లి 218.52, రైల్వే కోడూర్‌ 534.23, కురబలకోట 417.91, లక్కిరెడ్డిపల్లి 205.54, మదనపల్లి 233.39, మొలకలచెరువు 270.58, నందలూరు 50.93, నిమ్మనపల్లి 132.17, ఓబులవారిపల్లి 185.85, పెద్దమండ్యం 395.58, పెద్దతిప్పసముద్రం 1194.59, పెనగలూరు 195.2, పీలేరు 220.1, పుల్లంపేట 190.22, రాజంపేట 262.83, రామాపురం 321.35, రామసముద్రం 608.24, రాయచోటి 196.53, సంబేపల్లి 253.19, సుండుపల్లి 265.88, తంబళ్లపల్లి 471.6,వాయల్పాడు 208.67, వీరబల్లి 179.12 సెంట్లు ఉన్నాయి.జిల్లాలో కొత్తగా ఆలయాల ఏమైనా మంజూరయ్యాయా? టిటిడి శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి కాలనీల్లో పది లక్షల స్కీముల కింద అన్నమయ్య జిల్లాలో 181 వివిధ ఆలయాల నిర్మాణాలు జరగుతున్నాయి. ఆలయాల అభివద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 2018 -19 నుంచి ి 2023-24 వరకు శిథిలావస్థలో ఉన్న ఆలయాల జీర్ణోద్ధరణ కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడానికి సర్వశ్రేయోనిధి అనే స్కీమును ప్రవేశపెట్టి తద్వారా నిధులను మంజూరు చేసింది. జిల్లాలో మొత్తం రూ.22,11,50 కోట నిధులు మంజూరయ్యాయి. పథకం కింద అన్నమయ్య జిల్లాలోని రెండు ఆలయాలను నిర్మించడానికి టిటిడి ద్వారా రూ 38,00,000/- నిధులు మంజూరయ్యాయి. ప్రజలకు సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఆలయ భూములకు కౌలు మొత్తం చాలా తక్కువగా వస్తోంది. ఇతర భూములతో పోల్చుకొని దేవాలయ భూములకు కూడా కౌలు మొత్తం పెంచాల్సిన అవసరముంది. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆలయాలకు సంబంధించి ఎలాంటి సమస్య కానీ, ఆక్రమణదారుల గురించి కానీ సమస్యలుంటే రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ పక్కన ఉన్నటువంటి జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.

➡️