ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై నిరసన

ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్‌ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆస్పత్రి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. వివరాలు.. జమ్మలమడుగు పట్టణంలోని బిసి కాలనీకి చెందిన బడిగింజల దేవి (16) అనే బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. మంగళవారం ఉదయం వరకు పోస్టుమార్టం నిర్వహి ంచలేదు. పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్‌ అందుబాటులో లేకపోవడంతో బయట నుంచి తెప్పించారు. మంగళవారం ఉద యం మతదేహానికి చీమలు పట్టి ఉండ డంతో బాధితులు గమనించి ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. మతదేహాన్ని పెట్టిన ఫ్రీజర్‌ పనిచేయలేదని, మతదేహంపై చీమలు ఉంటే గమాక్సిన్‌ పౌడర్‌ చల్లాలని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేపట్టారు. మతదేహాన్ని ఎసిలో పెట్టకుండా సిబ్బంది నిర్లక్ష్యం చేశారని మతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వ్యవరిస్తున్నారని మతదేహానికి చీమలు పట్టడంతో ఆవేదనతో సిబ్బందిని అడిగినందుకు తమపైనే ఆస్పత్రి సిబ్బంది దాడికి దిగినట్లు బాధితులు వాపోయారు. ఫ్రీజర్‌ పనిచేయలేదని తెలిసికూడా నిర్లక్ష్యంగా మతదేహాన్ని పోస్టుమార్టం గదిలో పెట్టడం మతి చెందిన బాలిక చుట్టూ చీమలు పట్టాయని చెప్పారు. ప్రశ్నించినందుకు పోలీసులకు ఫోన్‌ చేసి బెదిరించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఫిక్‌ పాషా మాట్లాడుతూ ఫ్రీజర్‌ పనిచేయకపోవడంతో ఘటన జరిగిందని దీనిపై సమగ్రంగా విచారణ చేపడుతామని తెలిపారు.నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలి : డివైఎఫ్‌ఐ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, ఆస్పత్రిలో ప్రధానమైన బాడీ ఫ్రీజర్‌, జనరేటర్‌ వంటివి లేవని వాటిని ఏర్పాటు చేయకపోవడం దారుణమని డివైఎఫ్‌ ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా అలసత్వం సిబ్బంది చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆస్పత్రి సూపరిండెంట్‌కు వినతి పత్రం అందజేశారు.

➡️