ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటాం

 ప్రజాశక్తి-ఉక్కునగరం : ఎన్నో పోరాటాలు, ఉద్యమాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కును కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టంచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 1090వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ ఎంఎంఎస్‌ఎం, ఎస్‌టిఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మూడేళ్లుగా దీక్షలు చేస్తున్నా కేంద్రప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షల్లో కార్మిక నేతలు డి.దేముడు, జి.ఆనంద్‌, ఎంకెవి.రాజేశ్వరరావు, డి.రమేష్‌, వర్మ, డిసిహెచ్‌.వెంకటేశ్వరరావు, యు.వెంకటేశ్వర్లు, జివి.రమణారావు , పివి.సాగర్‌, నమ్మి సింహాద్రి, వి.కృష్ణంనాయుడు, సిహెచ్‌.సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️