ఉపాధి పనుల పరిశీలన

Feb 5,2024 21:14

ప్రజాశక్తి – జామి  : మండలంలోని గొడుకొమ్ము గ్రామంలో చేపడుతున్న ఉపాధిహామీ పనులను డ్వామా పీడీ జి.ఉమాపరమేశ్వరి ఆకస్మికంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో మస్టర్లు, పనిపుస్తకాలను తనిఖీ చేశారు. మేట్లు, కూలీలతో మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ, రోజు కూలి రూ.272 వచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నీడ, మంచినీటి సదుపాయం, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఫీల్డ్‌అసిస్టెంట్‌ను ఆదేశించారు. 100 రోజులకు దగ్గరలో ఉన్న వారిని పనిలోకి తీసుకురావాలని, వారితో పనిచేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఫీల్డ్‌అసిస్టెంట్‌ ఎం.జగదీశ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సిహెచ్‌ఎస్‌.కేదారేశ్వరరావు పాల్గొన్నారు.

➡️