ఉపాధి సిబ్బందిపై పీడీ ఆగ్రహం

Mar 6,2024 21:20

ప్రజాశక్తి- మెంటాడ: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌లో డ్వామా పీడీ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికీ లెక్కల్లేవ్‌, ఓ పద్దతి లేదు, ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, అంతటా అక్రమాలే, అడుగడుగునా అవకతవకలే, ఉద్యోగాలు చేసేది ఇలాగానే, ఇంత బాధ్యతా రాహిత్యమా, మీపై చర్యలు తీసుకోకుంటే మిగతా వారికి తప్పుడు సందేశం ఇచ్చినట్టు కాదా, అని పీడీ ఉమాపరమేశ్వరి మండి పడ్డారు. సిమెంట్‌, ఇనుము, మొక్కలూ ఏవని ప్రశ్నించారు. మీపై క్రిమినల్‌ కేసు ఎందుకు పెట్టకూడదని ఎపిఒపై ఫైర్‌ అయ్యారు. అక్రమాలకు పాల్పడిన బుచ్చిరాజుపేట పీల్డ్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. రోజు కూలీ రూ.600లకు పెంచాలిఉపాధి హామీ కూలీలకు రోజు కూలి రూ.600లకు పెంచాలని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి రాకోటి రాములు కోరారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌ ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన డ్వామి పీడీ ఉమా పరమేశ్వరికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో కూలి రేట్లు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి తామారాపల్లి సోములు పాల్గొన్నారు.

➡️