ఉపాధ్యాయుల సమస్యలు పట్టని ప్రభుత్వం : యుటిఎఫ్‌- ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మతికి నివాళులు

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యమేంటని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం మహేష్‌ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కడప కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు చేపట్టకపోవడం తగదన్నారు. బదిలీలు, ఉద్యోగోన్నతులు లేక మున్సిపల్‌ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల మున్సిపల్‌ విద్యారంగం సంక్షోభంలో కొట్టువి ుట్టాడుతున్నదన్నారు. విద్యాశాఖ పర్యవేక్షణలోకి వచ్చిన తర్వాత కూడా బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించలేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈనెల 30న విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్‌, ట్రెజరర్‌ కె.నరసింహారావు, రాష్ట్ర కౌన్సిలర్‌ రూతు ఆరోగ్య మేరీ జిల్లా కార్యదర్శి ఏజాస్‌ అహ్మద్‌ , ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎం.ప్రభాకర్‌, నాయకులు బి.చంద్రశేఖర్‌, గోపీనాథ్‌, జి.వెంకటసుబ్బయ్య, అనిల్‌, వెంకటరమణ, కరిముల్లా నాగరాజు, శివశంకర్‌,మాలే బాబు, ఎ.డి.దేవదత్తం, కిరణ్‌ కుమార్‌, ప్రకాష్‌ పాల్గొన్నారు. ముందుగా రోడ్డు ప్రమాదంలో మతి చెందిన ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉద్యమ నేత షేక్‌ సాబ్జి మతికి సంతాపం తెలియజేస్తూ ఆయనచిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

➡️