ఉమ్మడి జిల్లాలో భువనేశ్వరి పర్యటన

ప్రజాశక్తి-కడప అర్బన్‌ టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి మూడ్రోజులపాటు కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. 20, 21, 22వ తేదీల్లో ఆమె పర్యటన ఖరారైంది. చంద్రబాబు అరెస్టుకు గురై జైలులో ఉండటాన్ని తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ‘నిజం గెలవాలి’ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం అన్నమయ్య జిల్లాలోని గాలివీడు మండలం ఎగువగొట్టివీడు గ్రామంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి చెక్కులు అందజేస్తారు. మధ్యాహ్నం రాయచోటి పట్టణం రాజుల కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదే రోజు రాత్రికి తిరుపతిలో బస చేస్తారు. 21వ తేదీన తిరుమల దర్శనం చేసుకుని సాయంత్రానికి పోరుమామిళ్ల చేరుకుంటారు. కొత్తవీధి, బలిజకోట, చెన్నంపల్లి బాధిత కుటుంబాలను పరామర్శించి బద్వేల్‌కు వెళతారు. రాత్రికి బద్వేల్‌లోని ఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో బస చేస్తారు. 22వ తేదీన బద్వేల్‌ పట్టణంలోని గుంతపల్లి, లింగారెడ్డిపల్లి, కలసపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి, తెల్లపాడు గ్రామాల్లో పర్యటిస్తారు. బాధిత కుటుంబాలను పరామర్శించి చెక్కులు పంపిణి చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గూడూరుకు బయలుదేరి వెళతారు.’నిజం గెలవాలి’ని విజయవంతం చేయండి : ‘మండిపల్లి’ప్రజాశక్తి- రాయచోటి నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం మధ్యాహ్నం రాయచోటి నియోజవర్గంలోని గాలివీడు మండలం ఎగువగొట్టివీడు గ్రామం తోపాటు రాయచోటి పట్టణం రాజుల కాలనీలో పర్యటిస్తారని తెలిపారు కార్యక్రమాన్ని టిడిపి నాయకులు కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

➡️