ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

Jan 26,2024 21:49
ఫొటో : జెండా ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : జెండా ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాప్రతినిధులు, నాయకులు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకానికి గౌరవవందనం చేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ప్రతిఒక్కరి దృష్టిలో పెట్టుకుని అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా మన భారతదేశం రూపొందే విధంగా రాజ్యాంగాన్ని ప్రజలకు అందజేశారని, ప్రతి ఒక్కరూ, ప్రతిక్షణం రాజ్యాంగాన్ని అనుసరిస్తే దేశాభివృద్ధికి పాటుపడిన వారవుతారన్నారు. కార్యక్రమంలో జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఆదిశేషయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ, కౌన్సిలర్లు దగుమాట శివకోటారెడ్డి, మహబూబ్‌ బాషా, సయ్యద్‌ నౌషద్‌ బేగం, పుచ్చలపల్లి రాధిక, కొప్పోలు రమాదేవి, పొడమేకల పెంచలయ్య, నాయకులు నోటి వినరుకుమార్‌ రెడ్డి, సయ్యద్‌ జమీర్‌ బాషా, ఆండ్రా సుబ్బారెడ్డి, కొండా చినవెంకటేశ్వర్లు, ఈశ్వర్‌ రెడ్డి, నందవరం ప్రతాప్‌, బడే నరేంద్రరెడ్డి, సురేష్‌ రెడ్డి, తదితరలు పాల్గొన్నారు.

➡️