ఎంఎల్‌ఎ ‘మానుగుంట’కు కృతజ్ఞతలు

Jan 3,2024 19:54
కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యం

కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యం
ఎంఎల్‌ఎ ‘మానుగుంట’కు కృతజ్ఞతలు
ప్రజాశక్తి – లింగసముద్రం జిల్లా వైసిపి అనుబంధ విభాగాల్లో లింగసముద్రం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించింది.వైసిపి సేవాదళ్‌ విభాగం జాయింట్‌ సెక్రటరీగా ఉండేలా ఆది నారాయణరెడ్డి, జిల్లా వైసిపి ప్రచార కమిటీ జాయింట్‌ సెక్రటరీగా పూరిమిట్ట శ్రీనును తీసుకున్నారు. దీంతో వారు బుధవారం లింగసముద్రంలోని వైసిపి కార్యాల యంలో మండల వైసిపి కన్వీనర్‌ను పిచ్చపాటి తిరుపతిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ తమకు పార్టీ పదవులు వచ్చేలా తమని గుర్తించిన మహీధర్‌రెడ్డి గెలుపు కోసం రానున్న ఎన్నికల్లో పని చేసి, పార్టీ అభివృద్దికి కృషి చేస్తామని చెప్పారు. తిరిగి మహీధర్‌రెడ్డిని ఎంఎల్‌ఎగా గెలిపించుకొనేందుకు కలిసి కట్టుగా పనిచే ద్దామన్నారు.తమకు పదవులు వచ్చేందుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కిలారి సురేంద్ర,బట్టరుశెట్టి రాఘవనాయుడు, గారపాటి మహేంద్ర ఉన్నారు.

➡️