ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

సత్తెనపల్లి రూరల్‌: టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటనే వరికపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు చెప్పారు. సత్తెన పల్లి మండలం వెన్నాదేవిలో ఎన్టీఆర్‌ విగ్రహావి ష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో జీవి ఆంజనేయులు, సత్తెనపల్లి నియోజకవర్గ,టిడిపి ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారా యణ, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, నర్సరావుపేట టిడిపి ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు పాల్గొని ఎన్టీఆర్‌ విగ్ర హాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టిడిపి జెండా ను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జీవి ఆంజ నేయులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఒక్క పంటకు కూడా సాగు నీరు విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ఆయకట్టుకు సాగునీరు అందిం చాలన్న ఉద్దేశంతో గోదావరి పెన్నా నదుల అను సంధానానికి చంద్రబాబు భూమి పూజ చేసి విడు దల చేస్తే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు ను పట్టించుకోకుండా పల్నాడు, ప్రకాశం జిల్లాలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు వేసి గెలిపించాలని యువతను కోరారు.

➡️