ఎన్నికల్లో టిడిపి-జనసేనదే విజయం

ప్రజాశక్తి-చీమకుర్తి: రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేనదే విజయమని సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్‌ విజయకుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రచ్చమిట్ట, గరికమిట్ట సెంటర్లలలో జరిగిన బాబు ష్యూరిటీ భవిషత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా రచ్చమిట్ట సెంటర్‌లో టిడిపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిఎన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని అన్నారు. జగన్‌ అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు. టిడిపి, జనసేన కలయికతో వైసిపితో కలవరం బయలుదేరిందన్నారు. దోపిడీ లేని పాలన కోసం టిడిపి ఆదరించాలన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు మన్నం ప్రసాదు, గొల్లపూడి సుబ్బారావు, అయినీడి సుబ్బారావు, కాట్రగడ్డ రమణయ్య, ఉన్నం సుబ్బారావు, యడ్లపల్లి రామబ్రహ్మం, శేషయ్య, సూరంపల్లి హనుమంతరావు, నర్రా నాగరాజు, గొల్లపూడి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️