ఎన్నికల కోడ్‌ అమలు పక్కాగా చేయాలి

Mar 18,2024 21:30

ప్రజాశక్తి – సీతంపేట ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయాలని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కల్పనాకుమారి అన్నారు. సోమవారం సీతంపేట మండలంలోని జక్కరవలస, మండ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్‌ అమలును పరిశీలించారు. ఇంకా ఎక్కడైనా రాజకీయ నాయకుల పోస్టర్లు, విగ్రహాలుంటే వెంటనే తొలగించాలని సూచించారు. రాజకీయ నాయకుల పేర్లతో ఉన్న శిలాఫలకాలను కూడా మూసివేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ గీతాంజలి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కురుపాం : ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయాలని ఆర్‌ఒ వివి రమణ అధికారులకు సూచించారు. సోమవారం కురుపాంలో ప్రధాన రహదారికి ఇరువైపులు ఉన్న ప్రధాన కేంద్రాల వద్ద షాపుల వద్ద ఎన్నికల కోడ్‌ అమలు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ ఇంకా ఎక్కడైనా రాజకీయ నాయకులు, పోస్టర్లు వెంటనే తొలగించాలన్నారు. రాజకీయ నాయకుల పేర్లతో ఉన్న శిలా ఫలకాలను కూడా మూసివేయాలని తెలిపారు. కార్యక్రమం లో తహశీల్దార్‌ సత్యనారాయణ, ఎంపిడిఒ ఎస్‌.అప్పారావు, కరుణాకర్‌, ఇఒకె.చంద్రశేఖర్‌, తదితరలు పాల్గొన్నారు.

➡️