ఎన్నికల తుది జాబితా విడుదల

Jan 22,2024 22:57
ఎన్నికల తుది జాబితా విడుదల

ప్రజాశక్తి-అమలాపురంఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు సోమవారం తుది జాబితా ప్రచురణ ప్రతులను అందించినట్టు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 అనుసరించి కోనసీమ జిల్లావ్యాప్తంగా ముసాయిదా ప్రకారం మొత్తం ఓటర్లు 14,88,794 మంది నమోదు కాగా తుది జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 15,10,472 మందికి చేరారన్నారు. ముసాయిదా తుది జాబితాల మధ్య వ్యత్యాసం మొత్తం 21,678 మందిగా నమోదయ్యారని చెప్పారు. వీరిలో పురుషులు 9,317 మంది కాగా, స్త్రీలు 12,366 మంది ఉన్నారన్నారు. ట్రాన్స్‌జెండర్స్‌ తుది జాబితాలో ఐదుగురు తగ్గడంతో జిల్లావ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లు 17 మందిగా నమోదయ్యారన్నారు. తుది జాబితా ప్రకారం జిల్లావ్యాప్తంగా పురుష ఓటర్లు మొత్తం 7,50,066, మంది కాగా స్త్రీ ఓటర్లు మొత్తం 7,60,389 మందిగా నమోదు, ట్రాన్స్‌జెండర్స్‌ 17 మంది నమోదు కాగా వెరసి జిల్లావ్యాప్తంగా మొత్తం ఓటర్లు 15,10,472 మంది ఉన్నారన్నారు. తుది జాబితా ప్రకారం రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 99,361 మంది కాగా, స్త్రీ ఓటర్లు 1,00,785 మంది ఒక ట్రాన్స్‌జెండర్‌ నమోదయ్యారని, మొత్తం ఓటర్లు 2,00,147 మందిగా నమోదయ్యారన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,20,680 మంది కాగా, స్త్రీ ఓటర్లు 1,21,190 మందిగా నమోదు కాబడి వెరసి మొత్తం ఓటర్లు 2,41,870 నమోదు అయ్యారన్నారు. అమలాపురం నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,05,166 మంది, స్త్రీ ఓటర్లు 1,05,724 మంది, రాజోలు నియోజకవర్గంలో పురుష ఓటర్లు 96,552 మంది, స్త్రీ ఓటర్లు 98,637 మంది, పి.గన్నవరం నియోజకవర్గంలో పురుష ఓటర్లు 98,969 మంది, స్త్రీ ఓటర్లు 97,363 మంది, కొత్తపేట నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,23,389 మంది కాగా, స్త్రీ ఓటర్లు 1,24,998 మంది, మండపేట నియోజకవర్గంలో పురుష ఓటర్లు1,05,949 మంది, స్త్రీ ఓటర్లు 1,11,692 మంది నమోదయ్యారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ముసాయిదా జాబితా కన్నా పెరిగిన ఓటర్లు 2,146, ముమ్మిడివరంలో 3,373, అమలాపురంలో 4,508, రాజోలులో 3,501, గన్నవరంలో 2,862, కొత్తపేటలో 3,037, మండపేటలో 2,251, మొత్తం జిల్లావ్యాప్తంగా 21,678 మంది ఓటర్లు పెరిగారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబు, కాంగ్రెస్‌ తరపున కామన ప్రభాకర్‌ రావు, టిడిపి తరఫున అల్లాడి స్వామి నాయుడు, వైసిపి తరపున సంసాని నాని, షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, బిజెపి తరపున దూలం రాజేష్‌, సిపిఎం తరపున కారెం వెంకటేశ్వరరావు, బిఎస్‌పి తరపున కాశీ లక్ష్మీ భవాని, సిపిఐ తరఫున సత్తిబాబు పాల్గొన్నారు.

➡️