ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయాలి

 పల్నాడు జిల్లా: రాజకీయ పార్టీల, ఏఈఆర్‌ఓలతో జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. నరస రావుపేటలోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ లో ఏఈఆర్‌వోలు, ఏఆర్వోల తో మాట్లాడారు. త్వరలో జరగ నున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ప్రవ ర్తన నియమావళి (ఎంసీసీ)ని కచ్చితంగా అమలు చేయాలని, గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలలో 87 శాతం పెంచాలని సంబంధిత అధి కారులను, రాజకీయ నాయకులను ఆదేశించారు.జిల్లాలో త్వరలో జరగనున్న ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహిం చేందుకు పెండింగ్‌లో ఉన్న ఫారమ్‌ లు 6,7,8 పూర్తి చేయా లని పేర్కొన్నారు. నోటి ఫికేషన్‌ జారీ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎంసిసి అమల్లో ఉంటుందని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఈసీఐ జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా అమలు చేయ డం శిరోధార్యమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి అధికారీ నిష్పక్షపాతంగా విధులను నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ కొత్తగా విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో ఉన్న అంశాలపై ఎన్నికల సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల ప్రవ ర్తన నియ మావళి అమలు, ఖర్చుల లెక్కింపు తదితర అంశ ా లపై ఎం సిసి బృందాలు, ఏఈఆర్‌ఓలు, వ్యయ పరిశీలకులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌, పోలీసు అధికారులు, వీడియో, ఇతర సిబ్బందికి శిక్షణా కార్యక్రమం పూర్తయినట్లు చెప్పారు. సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, ఆర్డిఓ అజరు కుమార్‌, జి. రవి పాల్గొన్నారు.

➡️