ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ ప్రారంభం

Dec 27,2023 23:15 #ఎస్‌ఎఫ్‌ఐ
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ ప్రారంభం

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి పెన్షనర్స్‌ ప్యారడైజ్‌గా పేరొందిన కాకినాడ నగరం ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభకు వేదికైంది. అల్లూరిసీతారామరాజు నగర్‌, ధీరజ్‌ సభా ప్రాంగణంలో ఈ మహాసభ బుధవారం ఉత్తేజభరిత వాతావరణంలో ప్రారంభమైంది. పభా ప్రాంగణాన్ని నాయకులు ఫ్లెక్సీలు, సెల్ఫీ పాయింట్లతో అందంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు హాజరయ్యారు. తొలిరోజు జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన సభ జిల్లాల వారీ చర్చల నివేదికతో ముగిసింది. మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుభ్రహ్మణ్యం ప్రారంభోపన్యాసం చేయగా, ఎంఎల్‌సి ఐవి ఆహ్వాన సంఘం ఉపన్యాసం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. విద్యారంగ పరిరక్షణకు మరిన్ని పోరాటాలుపిడిఎఫ్‌ మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం విద్యారంగ పరిరక్షణకు ఎస్‌ఎఫ్‌ఐ భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిడిఎఫ్‌ మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్‌ అధ్యక్షతన జరిగిన 24వ రాష్ట్ర మహాసభలో ఆయన ప్రారంభ ఉపన్యాసమిచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలలు బతికి ఉన్నాయంటే అది ఎస్‌ఎఫ్‌ఐ పొరటాల ఫలితమేనన్నారు. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా సమరశీలంగా పోరాడుతున్న సంఘం ఎస్‌ఎఫ్‌ఐ అన్నారు. చదువు అనేది వెనుకబాటు తనం, దోపిడీ, ఆజ్ఞానం, అన్యాయం నుంచి బయటకి తెచ్చేదిగా ఉండాలన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. నూతన విద్యా విధానం వల్ల జరుగుతున్న నష్టాలను ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల స్కూళ్లు మూతబడ్డాయన్నారు. ఖాళీ టీచర్‌ పోస్టులు భర్తీ కావడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమన్నారు. నానాటికీ విద్యా ప్రమాణాలు దిగజారుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపిలో నాణ్యమైన చదువులు కరువయ్యాయన్నారు. అనంతరం ఎంఎల్‌సి ఐవి ఆహ్వాన సంఘం ఉపన్యాసం చేశారు. ొ అమరవీరులకు నివాళిఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌ అధ్యక్షతన బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి చిత్రపటానికి మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే స్వాతంత్య్ర పోరాట వీర కిశోరం భగత్‌ సింగ్‌ విగ్రహానికి పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చిత్రపటానికి ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షులు విపి.సాను, ఆలిండియా ఉపాధ్యక్షులు ఆదర్శ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాప తీర్మానాన్ని సిహెచ్‌.వినోద్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించింది.ొ ఆకట్టుకున్న సభా ప్రాంగణంఅల్లూరి సీతారామరాజు నగర్‌లో ధీరజ్‌ సభ ప్రాంగణంలో మహాసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాయకులు తెలిపారు. మహాసభ ప్రాంగణం వద్ద 1970 సంవత్సరం నుంచి 2021 వరకు ఎన్నికైన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శుల ఫోటో ఫ్రేమ్స్‌ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద సెల్ఫీ ఫ్రేమ్‌, ఐ లవ్‌ ఎస్‌ఎఫ్‌ఐ, ప్రధాన ద్వారం ఎదురుగా ‘మా స్ఫూర్తి’ అంటూ దేశ, అంతర్జాతీయ నాయకుల చిత్రపటాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజానాట్యమండలి కళాకారులు విద్యార్థి ఉద్యమ గీతాలను ఆలపించారు. ఎస్‌ఎఫ్‌ఐ పతాకం ఆవిష్కరణప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురంభారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 24వ రాష్ట్ర మహాసభ కాకినాడలోని అల్లూరి సీతారామరాజు నగర్‌, ధీరజ్‌ సభా ప్రాంగణంలో ఉత్సాహపూర్తమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌ ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు విపి.సాను అమరవీరుల స్తూపానికి, అల్లూరి సీతారామరాజు, ధీరజ్‌ రాజేంద్రన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆలిండియా ఉపాధ్యక్షులు ఆదర్శ సాజి, పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షులు వై.వెంకటేశ్వరరావు, పిడిఎఫ్‌ మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం, తదితరులు నివాళులర్పించారు. మహాసభ ప్రాంగణం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఉద్యమ గీతాలు ఆలపించారు. ‘వీరులారా వందనం.. విద్యార్థి అమరులారా వందనం మీ పాదాలకు’… అంటూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గీతాలు ఆలపించారు.

➡️