ఏజెన్సీ కవులకు సన్మానం

Dec 17,2023 21:20

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  :  డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ నేతృత్వంలో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో కన్వీనర్‌ కొల్లి రామావతి సారధ్యంలో ఈనెల 16,17 తేదీల్లో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి జిల్లా శ్రీశ్రీ కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు, గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ కవులు పాలక దేవానంద్‌, పెద్దింటి నిర్మల్‌ కుమార్‌ హాజరయ్యారు. ఏజెన్సీ నుంచి తెలుగు సాహిత్యానికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి సన్మానించారు.

➡️