ఏల్చూరులో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’

ప్రజాశక్తి-సంతమాగులూరు: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలుగు మహిళా నేతలు ప్రజలకు వివరించారు. మంగళవారం మండలంలోని ఏల్చూరు గ్రామంలో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశాల మేరకు పథకాల అమలును ప్రజలకు వివరించారు. గ్రామంలోని ముస్లిం కాలనీ, సినిమా హాల్‌ సెంటర్‌లో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు ద్వారా వివరించారు. గతంలో రవికుమార్‌ హయాంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు రంజాన్‌ తోఫా, చంద్రన్న పెళ్లి కానుక వంటి పథకాలతో పేద ప్రజలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పడగానే సంక్షేమ పథకాలతో మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని వారు మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు నాగబోతు సుజాత, కొనికి గోవిందమ్మ, గుమ్మా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

➡️