ఐసిడిఎస్‌ను బలోపేతం చేసుకుందాం : ‘సిటు’

ప్రజాశక్తి – రాయచోటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌ను ప్రయివేటీకరణ చేసేందుకు వేగంగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అందరూ ఐక్యంగా పోరాడి బలోపేతం చేసుకుందామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం రాయచోటి శివ నర్సింగ్‌ కళాశాలలో అంగన్వాడీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా కార్మిక సంక్షేమం కోసం ఉన్న 44 చట్టాలను 4 చట్టాలుగా కుదించి కట్ట బానిసలుగా మార్చి కార్పొరేట్లకు కట్టుబెట్టే యోచనలో ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే కార్మికులు చైతన్యవంతమై ప్రజాఉద్యమాలు నిర్మించి ఐక్యంగా సుదీర్ఘ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు సీనియర్‌ నాయకులు పి.బంగారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్వరి, అధ్యక్షులు శ్రీలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.చంద్రశేఖర్‌, ఎ.రామాంజులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️