ఒంటి కాలిపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

కార్మికుల నిరసన

ప్రజాశక్తి – పెద్దాపురంతమ సమస్యల పరిష్కారం కోసం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 8వ రోజుకు చేరుకుంది. మున్సిపల్‌ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్‌ రెడ్డి సమాన పనికి సమాన వేతనం ఇస్తానని మున్సిపల్‌ కార్మికులకు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని అమలు చేయడం లేదన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తుంటే పోటీ కార్మికులను రంగంలోకి దింపి కార్మికుల మధ్య వివాదాలు రగిలించటం అన్యాయ మన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించ ాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శివకోటి అప్పారావు, వర్రే గిరిబాబు, భూపతి శ్రీను, మడికి కృష్ణ, చేపల అర్జియ్య, వర్రే రాజేష్‌, ముత్యాల దుర్గ, వర్రే కుమారి, పెడారి గంగాభవాని, వెంకటలక్ష్మి, సత్యవతి, వర్రె నాగదేవి, మడికి మోహన్‌ రావు, దోనం దేవ ప్రసాద్‌, దొండపాటి సురేష్‌, దొండపాటి శేఖర్‌, ఆర్‌ సురేష్‌, శ్రీకాంత్‌, వర్రె రమణ, పలివెల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.పిఠాపురం (గొల్ల పోలు) తమ సమస్యల పరిష్కారం కోసం నగర శానిటేషన్‌ వర్కర్లు చేస్తున్న సమ్మె మంగళవారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కె.చిన్న, నందీశ్వరరావు శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సిహెచ్‌.రమణ మాట్లాడారు. శానిటేషన్‌ వర్కర్స్‌ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి కనీస వేతనం అమలు చేయాలని రిటర్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యం కల్పించి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్‌ వర్కర్లు బి.సతీష్‌, జి.రాజులు, సిహెచ్‌.రాజమోహన్‌, రావులమ్మ, పార్వతి పాల్గొన్నారు.

➡️