ఓటుహక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ

Feb 17,2024 21:33
ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, పిల్లల తల్లులు

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, పిల్లల తల్లులు
ఓటుహక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ
ప్రజాశక్తి-అనంతసాగరం : ఓటుహక్కు సద్వినియోగం చేసుకుని రాజ్యాంగాన్ని కాపాడాలి అంటూ అంగన్‌వాడీ వర్కర్లు, పిల్లల తల్లులు శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రాజెక్టు సూపర్‌వైజర్‌ శారద పాల్గొని మాట్లాడుతూ దేశంలో 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని, అర్హులైన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీ ఓటరు కీలకపాత్ర పోషించాలని, ఓటు అనే వజ్రాయుధాన్ని సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు వినియోగించాలన్నారు. యువత గ్రామంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి ప్రతిఒక్కరూ ఓటు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగం రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కుగా భావించాలన్నారు. ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కొత్త ఓటర్లు ఇవిఎంలో జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు కె.భాగ్యమ్మ, నాగమణి, సునీత, డి.భాగ్యమ్మ, అంగన్‌వాడీ హెల్పర్లు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

➡️