కంటి వైద్యశాల ప్రారంభం

ప్రజాశక్తి-కొనకనమిట్ల: కొనకనమిట్లలో ఎల్‌వి ప్రసాద్‌ కంటి వైద్యశాలను శనివారం ఎంపిడిఒ అద్దంకి శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. కొనకనమిట్ల, మార్కాపు రం, తర్లుపాడు, దొనకొండ, పొదిలి ప్రాంతాల్లోని వారు వైద్య పరీక్షలు చేయించుకోవచ్చునన్నారు. అనంతరం వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ ఎస్‌వి బాలయ్య, ఎంపిటిసి కళ్లం దిబ్బారెడ్డి, డాక్టర్‌ విశాక్‌ పద్మకుమార్‌, కేంద్ర అడ్మినిస్ట్రేషన్‌ కె మేష్‌, విషన్‌ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ కె దేవయ్య, కమ్యూని టీ కో ఆర్డినేటర్‌ ప్రేమసాగర్‌, ఆప్టికల్‌ పర్సన్‌ వందన, టెక్నీషియన్‌ మల్లేష్‌, టెక్నికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️