కడప నగరం అస్తవ్యస్తం : అఖిలపక్షం

కడప : ప్రజా ప్రతినిధులు అధికారులు కడప నగరాన్ని అభివద్ధి పేరుతో అస్తవ్యస్తంగా మారుస్తున్నారని అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌. ఏ. సత్తార్‌ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. ‘కడప నగర అభివద్ధికి రూ.2,100 కోట్లు మంజూరు అయ్యాయని, జరుగుతున్న అభివద్ధి ‘మీ కళ్ళకు కనపడలేదా ‘అంటూ కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా సోషల్‌ మీడియాలో తీవ్రంగా ప్రశ్నిం చారు అన్నారు. కానీ కడప అభివద్ధి మేడిపండు లాంటిదని వక్తలు విమర్శించారు. అభివద్ధి గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆవేశాలకు తావివ్వకుండా వివరించాలన్నారు. కడప నగరంలో రోడ్ల వెడల్పు, కూడళ్లు, డ్రెయినేజీ అభివద్ధి చేయడం అనేది మేడిపండు లాగా ఉందని ఆరోపించారు. ప్రధాన రోడ్లు ప్రధాన కోడళ్ళు అభివద్ధి మాత్రమే అభివద్ధి కాదు, నగరంలోని 50 డివిజన్లు అందులోని 250 వెనుకబడిన ప్రాంతాలున్నాయని, అవీ కడప నగరంలోనే భాగమే అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడళ్లు ప్రారంభించాలనే ఉద్దేశంలో పనులు ఆర్భాటంగా చేపడుతున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఒత్తిడి చేసి మరీ పనులు చేస్తున్నారు అన్నారు. సమావేశంలో భూ పోరాట కమిటీ నాయకులు బి నారాయణ రెడ్డి, అఖిలపక్ష కమిటీ కన్వీనర్‌ సిఆర్‌వి ప్రసాద్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌, బిఎస్‌పి జిల్లా ఇన్‌ఛార్జి గురప్ప ,ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌ రెడ్డి ,ఎస్‌డిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు చాంద్‌ బాషా, ఎం.ఆర్‌.ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు దస్తగిరి, లోక్‌ సత్తా పార్టీ నాయకులు దేవర కష్ణ, కాంగ్రెస్‌ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు శ్యామలాదేవి పాల్గొని ప్రసంగించారు.

➡️